మోడీని గద్దె దించుతాం:లాలూ
ప్రధా ని నరేంద్ర మోడీని గద్దె దించుతామని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పేర్కొ న్నారు. ఆదివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లా డుతూ మోడీపై విరుచుకు పడ్డారు. తమది జంగల్ రాజ్యమని మోడీ ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. బీహార్ ఫలితాలతో బిజెపి బెంగాల్ చేరుకోవడం కష్టమేనని లాలూ జోస్యం చెప్పారు. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ అజెండా అమలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బీహార్ యువత అండగా నిలువడం వల్లనే తామీ ఘన విజయాన్ని సాధించగలిగామని లాలూ పేర్కొన్నారు. బీహార్ ప్రజలు ఎన్డీఎకు సరైనా గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.బీహార్ అభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తామన్నారు.
No comments:
Post a Comment