Saturday 11 June 2016

Mallya ‘guarantor’ to sue Bank of Baroda for defamation

Mallya ‘guarantor’ to sue Bank of Baroda for defamation

Vijay Mallya's Pilibhit-based "guarantor", farmer Manmohan Singh, has served a legal notice on the Mumbai regional office of Bank of Baroda (BoB) as well as its local branch for recently freezing two of his bank accounts. Charging them for defamation, Singh has claimed Rs 10 lakh in compen-sation within 30 days.

Facebook

NEW YORK: The giantFacebook social media is pushing its users to download their private moments photo sharing application, according to a media report.
The social network has begun sending warnings that some photos will be removed before July 7 if the application is not installed. Last movement of the company has achieved the number Momentos an application in the App Store.

Friday 10 June 2016

అవమానించారు.........................


అవమానించారు..........







anju


 SPORTS.. మంత్రిపై అంజూ ఆరోపణ
తిరువనంతపురం: కేరళ క్రీడల మంత్రి ఈపీ జయరాజన్ తనను అవమానించారని ఒలింపియన్, భారత మాజీ మహిళా లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జ్ ఆరోపించింది. కేరళకే చెందిన అంజూ ప్రస్తుతం ఆ రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే, కౌన్సిల్ చీఫ్ హోదాలో అవినీతికి పాల్పడ్డానంటూ తనను తీవ్రంగా అవమానించారని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అంజూ ఫిర్యాదు చేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఈనెల 7న కౌన్సిల్ ఉపాధ్యక్షునితో కలిసి నేను క్రీడలమంత్రి జయరాజన్‌ను అభినందించేందుకు వెళ్లాను. అయితే, ఆయన రాష్ట్ర క్రీడల గురించేమైనా మాట్లాడుతారేమో అని అనుకున్నాను. 

కానీ, మీరంతా గత ప్రభుత్వం ద్వారా స్పోర్ట్స్ కౌన్సిల్‌కు ఎన్నికైనవాళ్లు. మీ నియామకాలన్నీ చట్ట విరుద్ధంగా జరిగాయి. మీ హయాంలో విమాన చార్జీలతో పాటు పలు విషయాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ పరుషంగా మాట్లాడారు అని అంజూ మీడియాతో చెప్పింది. అయితే, క్రీడల మంత్రి మాటలను ముఖ్యమంత్రి విజయన్ సమర్థించడం గమనార్హం. విమాన టిక్కెట్ల గురించి అడిగితే, అవమానించడమెలా అవుతుందని మీడియాతో విజయన్ పేర్కొన్నారు. 39ఏండ్ల అంజూ 2003లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది.

పెద్దగట్టు జాతర............

పెద్దగట్టు జాతర............
తెలంగాణ వచ్చేసింది.. కట్టిన ముడుపులు..చెల్లించాల్సిన మొక్కులు.. అదిగో.. దురాజ్‌పల్లిలో ఆ డిల్లెం బల్లెం చప్పుడు.. ఒలింగా.. ఓ లింగా నామస్మరణ విను.. పెద్దగట్టు లింగన్నకు మొక్కు చెల్లించే వేళయింది. కొండా కోనల్లో వెలసినవో లింగ శంభు లింగా.. అంటూ పెద్దగట్టు జాతరలో జనం చిందేస్తుంటే గొల్లగట్టు గొంతు కలుపుతున్నది. 

peddagattu3


దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్దది. లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల లాగు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలుపట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఒలింగా... ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రెపొటేల్‌ను తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపొటేల్‌కు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి, పసుపు, కుంకుమ బొట్లుపెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలందుకుంటారు. 

లింగమంతుడు శాఖాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా.. భక్తజన లింగనాదాల మధ్య నిన్న ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాదు.. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతీయేటా సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. రాష్ట్రం వచ్చాక తొలి జాతర కావడంతో భక్తులు పోటెత్తారు. 

చౌడమ్మ పల్లకిలో.. 


ఇది ఐదు రోజుల పండుగ. శనివారం మధ్యాహ్నం మూలవిరాట్‌లకు అలంకరణ మొదలయింది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరించారు. 

ఆదివారం జాతర తొలిరోజు. భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడకు చేరుకున్నారు. నేడు రెండోరోజు. యాదవ పూజారులు పోలు ముంతలు.. బొట్లు.. కంకణ అలంకరణలు చేయగా.. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పించారు. ఇక జంతుబలి ఉండనే ఉంది. జాతరిక జనసంద్రమవుతుంది. ఇక మూడో రోజైన మంగళవారం చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగువైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. నాలుగో రోజు నెలవారం. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఐదో రోజు... మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. 

ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉందని కొందరు.. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని.. ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు మరికొందరు చెప్తుంటారు. దురాజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో ఏడెనిమిది కొండగుట్టలున్న అటవీప్రాంతం ఉంది. శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదట.

చేరుకోవడం ఇలా... 


పెద్దగట్టు... హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారి(65వ నెంబర్) పై దురాజ్‌పల్లిలో ఉంది. సూర్యాపేట నుంచి 5 కిలోమీటర్ల దూరం. ప్రత్యేక బస్సులుంటాయి. 

ఫరహాబాద్ ఫారెస్ట్‌........

ఫరహాబాద్ ఫారెస్ట్‌.....
ఉరుకుల పరుగుల రోజువారీ జీవితంలో కాస్త విరామం కావాలనుకుంటే సరదాగా విహారానికి వెళ్లాలనిపిస్తుంది. కాంక్రీట్ జంగల్ నుంచి పారిపోవాలనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. కానీ ఎక్కడని వెతక్కోగలం? ఎంతోదూరం కాదు.. ఎంతో సమయం కాదు.. వంద మైళ్లు.. గంట ప్రయాణం చేస్తే చాలు.. పచ్చని ప్రకృతి ఒడిలో వాలిపోతారు. కాలాన్ని మర్చిపోయి కలల తీరంలో నిలిచిపోతారు. అవును... ఫరహాబాద్ ఫారెస్ట్‌లో అడుగుపెడితే అలాంటి అనుభూతే సొంతమవుతుంది. తెలంగాణలో అతిపెద్ద టైగర్ జోన్ ఫారెస్ట్‌లో సఫారీ జర్నీ వెరీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఫరహాబాద్ వ్యూ పాయింట్ కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.

- ఫరహాబాద్ ఫారెస్ట్‌లో సఫారీ జర్నీ
- కట్టిపడేసే అందాలు 
- మధురానుభూతులు సొంతం

అతి పెద్ద టైగర్‌జోన్..


Farahabad Tiger Forest Telangana Tourismతెలంగాణలో అతి పెద్ద టైగర్ జోన్ ఫారెస్ట్ ఫరహాబాద్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేదారిలో.. సరిగ్గా నగరం నుంచి 140 కిలో మీటర్ల దూరంలో ఫరహాబాద్ ఫారెస్ట్ తారసపడుతుంది. దట్టమైన అటవీ ప్రాంతం. అమ్రాబాద్ అటవిలో మరో భాగమే ఫరహాబాద్. ప్రకృతి అందాలకు నెలవు. రంగు రంగుల పక్షులు, రకరకాల జంతువులు. మైమరిపించే నెమలి నాట్యాలు. లేడి పిల్లల గంతులు, కోయిల కిలకిలా రావాలు.. వీటన్నింటినీ చూడ్డానికి మనసు తహతహలాడుతుంది. కానీ అడవిలో ప్రయాణం మరింత సాహసోపేతంగా సాగాలంటే సొంత వాహనాల్లో కాదు.. జీపుల్లో జర్నీ చేయాల్సిందే. 

పచ్చని అడవిలో జీపులో ప్రయాణం.. కెమెరా కంటికి నిండైన పండుగ. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫరహాబాద్ ఫారెస్ట్ విజిట్ కోసం ప్రత్యేకంగా సఫారి జర్నీ ఆఫర్ చేస్తోంది. రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో జీపులో దాదాపు 8మంది వరకు ప్రయణించవచ్చు. రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సఫారీ జర్నీకి అవకాశం ఉంటుంది. 

ఫరహాబాద్ వ్యూ పాయింట్..


45 నిమిషాల ప్రయాణం. తొమ్మిది కిలోమీటర్లు ప్రయణిస్తే చాలు... అందమైన వ్యూ పాయింట్ కళ్లను కట్టిపడేస్తుంది. మార్గమధ్యంలో జింకలు, కోతుల గుంపులు, నెమలి నాట్యాలు, ఎన్నెన్నో అటవీ జంతువులు, పక్షులు (కొన్నిసార్లు పులులు కూడా) కనిపిస్తాయి. నీటి తావుల చుట్టూ కనిపించే లేడి పిల్లలు, పక్షుల గుంపులను చూడడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక దారి మధ్యలో ఏడోనిజాం విడిది గృహాన్ని చూడవచ్చు.

నిజాం వేటకు వచ్చి ఇక్కడే విడిది చేసేవారని చెబుతుంటారు. చారిత్రక విశేషం కలిగిన ఈ అతిథి గృహం శిథిలావస్థలో ఉండడం విషాదం. చివరగా ఫరహాబాద్ వ్యూ పాయింట్ అన్నింటికంటే హైలెట్‌గా చెప్పవచ్చు. వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాల్ని చూడ్డం మర్చిపోలేని అనుభూతి. ఎత్తైన కొండమీది చూపు సారించిన దూరం పచ్చని అడవి కనిపిస్తుంది. అటవి మధ్యలో.. బ్రిటీష్ కాలంలో డాక్టర్ రస్సెల్స్ అనే అధికారి తవ్వించిన పెద్ద మానవ నిర్మిత సరస్సు కనిపిస్తుంది. 

ఈ సరస్సు నాలుగు హెక్టార్లకుపైగా విస్తరించి ఉండడం గమనార్హం. ఇక్కడ క్యాంటి లివర్ బ్రిడ్జి... టూరిజం ప్లాజా ఉండేవి( ప్రస్తుతం లేవు). ఇన్ని అందాల నడుమ సాగే ప్రయాణాన్ని ముగించాలంటే కూడా మనసంగీకరించదు. అలాంటి అనుభూతుల్ని మీరూ సొంతం చేసుకోవాలనుకుంటే.. మీరూ ఫరహాబాద్‌ని విజిట్ చేయండి మరి. తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. 

కల్పవృక్షాలు....అలంకరణ కాదు.. ఆక్సిజన్ కావాలి!!!!!!!!!

కల్పవృక్షాలు........



భారీగా ఏపుగా పెరిగే మొక్కలనే నాటుదాం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ ;చెట్టు.. ఊపిరినిచ్చే ప్రాణ వాయువు. ఆయువునిచ్చే ఔషధం! జీవితానికి నీడనిచ్చే గూడు. మనిషికి బతువుదెరువు. అన్నింటికీ మించి ప్రాణికోటి మనుగడకు ఆదెరువు. బాల్యంలో ఊగే ఊయలై.. వృద్ధాప్యంలో ఊతకర్రై జీవితమంతా మనతోనే ఉంటుంది. ఇలా మనల్ని కాపాడే చెట్టుకు కష్టమొచ్చింది. వీటిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. ప్రస్తుతం మొక్కలు నాటడం ఒక ఎత్తయితే.. ఉన్న చెట్లను కాపాడుకోవడం మరో ఎత్తు. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో మొక్కల ప్రాధాన్యత, వేటిని నాటితే మంచిదన్న అంశాలతో కూడిన కథనం మీకోసం.. 

పట్టణాలు, నగరాల్లో ఒక మొక్క నాటితే అది కలకాలం ఉంటుందన్న నమ్మకం లేదు. భూవినియోగ మార్పిడియే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో నాలుగు రోజులకే నిర్మాణాలు వెలుస్తున్నాయి. పార్కులు, ఖాళీలు స్థలాలు, కొండలు, గుట్టలన్న తేడాలేకుండా అత్యంత వేగంగా భూవినియోగం మారిపోతోంది. దీంతో నగరంలో నాటుతున్న మొక్కల జీవితకాలం 5 నుంచి 8 ఏళ్ల వరకే ఉంటోంది. ప్రస్తుతం చెట్లు నాటిన ప్రాంతం రూపురేఖలు నాలుగేళ్లకే మారిపోతున్నాయి. నగరం వేగంగా విస్తరించడం.. ప్రకృతి విపత్తులతో చెట్లు ఉన్న ఫలంగా కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొక్కలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

అలంకరణ మొక్కలతో అసలుకే మోసం..
మొక్కలు నాటడం వరకు అటుంచితే.. ఏ మొక్కలు నాటాలన్నదే అసలు సమస్యగా మారింది. మన నగరంలో నాటుతున్న మొక్కల్లో పర్యావరణానికి దోహదం చేసేవి చాలా తక్కువనే చెప్పవచ్చు. పూర్తిగా అలకరణ మొక్కలను నాటుతుండడంతో అసలుకే మోసం వస్తోంది. ఈ మొక్కలతో ఉపయోగం లేకపోగా.. కాలుష్యం వెలువడుతోందన్న వాదన లేకపోలేదు. 

జీహెచ్‌ఎంసీ అధికారులు నగరంలోని రోడ్ల మధ్యలో నాటుతున్న చెట్లు కాలుష్యానికి కారణభూతమవుతున్నాయని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ట్రంపెట్ వైన్, హైడ్రోంగియా, ఎంజెల్స్ ట్రంపెట్, లావెండర్, బెలూర్ ప్లవర్, హై బిస్కస్, లాంటి మొక్కలను నాటుతోంది. ఇవి పర్యావరణానికి ఏమాత్రం దోహదం చేసేవి కాకపోగా, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. రంగు రంగుల ఆకర్షణీయమైన చెట్ల ఆకులు, పువ్వులు రాలిపోయి చెత్తగా మారుతున్నాయి. వీటిని కంపోస్ట్‌గా మార్చే వ్యవస్థ లేకపోవడంతో డంపింగ్ యార్డుల్లో కాల్చివేయడంతో వాటి నుంచి విష రసాయనాలు, పొగ గాలిలో కలిసి కాలుష్యానికి కారణమవుతున్నారని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి బదులుగా మంచి ఆక్సీజన్‌నిచ్చే మొక్కలను నాటితే మంచిదన్న అభిప్రాయాలు లేకపోలేదు.

అత్యధిక ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఇవే.. 
వేప, తులసి, రావి, మామిడి, వెదురు, మేడి, జువ్వి, మారేడు, కానుగు, సపోటా, జమ్మి, మర్రి, చెట్లు అత్యధికంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. స్థానిక వృక్షజాతి మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. ఇవి ఏపుగా పెరిగి, విస్తారమైన ఆకులను కలిగి అధిక ఆక్సీజన్ ఇస్తాయి. హరిత హారంలో భాగంగా వీటిని నాటితేనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు, పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

24 గంటలు ఆక్సిజన్ ఇచ్చే తులసి 
మొక్కల్లో ఒక్క తులసి మొక్క మాత్రమే 24 గంటల పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. మొక్కల్లో సాధారణంగా సూర్యరశ్మి ప్రభావంతోనే కిరణ జన్య సంయోగ క్రియ జరుగుతుంది. అందుకే మొక్కలు పగటి పూట అధికంగా ఆక్సిజన్‌ను, రాత్రిపూట కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి. కానీ, సూర్యరశ్మి లేకపోయినా తులసి చెట్టు 24 గంటల పాటు కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. 

అటవీశాఖదే తప్పిదం 
మొక్కలు నాటడంలో అటవీశాఖ అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ మొక్కలు నాటాలో తెలిసి కూడా అధికారులు చొరవ తీసుకోవడం లేదు. ఇటీవల హరితహారంపై సచివాలయంలో జరిగిన సమీక్షలో పర్యావరణ వేత్తలుగా మేమంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. ఈ ఏడాది చేపట్టే హరితహారంలోనైనా రంగు రంగుల పుష్పాలతో ఆకర్షణీయంగా ఉండే మొక్కలను కాకుండా ఆక్సీజన్‌నిచ్చే మొక్కలను నాటాలి. హైదరాబాద్‌లో పెరగడానికి వీలున్న స్థానిక వృక్షజాతి మొక్కలనే నాటితే బాగుంటుంది. 
- సి.ఉమా మహేశ్వర్‌రెడ్డి

ప్రోగ్రెస్ కార్డులను నిర్వహించాలి
మొక్కలను నాటడమే కాదు.. అవి మనుగడ సాగించడం కోసం ప్రత్యేకంగా ప్రొగ్రెస్ కార్డులను నిర్వహించాలి. నెలకోసారి ఎన్ని మొక్కలు మిగిలాయి? ఎన్ని మొక్కలు పోయాయో? చూసుకోవాలి. చనిపోయిన మొక్కల స్థానంలో మరో మొక్కను నాటితే బాధ్యతను పంచుకున్నవాళ్లమవుతాం. ఇలా ఏడాది వరకు మనం నాటిన మొక్కల పెరుగుదల, మనుగడను రికార్డు చేయవచ్చు. 

-మానవుడు నిమిషానికి 300 ఎంఎల్, రోజుకు 0.84 కేజీలు, ఏడాదికి 9.5 టన్నుల ఆక్సిజన్‌ను పీల్చుకుంటాడు.
-ఒక చెట్టు రోజుకు 388 క్యూబిక్ ఫీట్లు మేర, ఏడాదికి 100 కేజీల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. 
-ఒక ఎత్తైన భారీ వృక్షం 260 పౌండ్ల ఆక్సీజన్‌ను అందిస్తుంది. 
-వంద ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వైశాల్యం గల చెట్టు 48 పౌండ్ల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని 6 వేల పౌండ్ల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
-విస్తారమైన ఒక చెట్టు విడుదల చేసే ఆక్సిజన్‌ను 9 మంది పీల్చుకునే అవకాశం ఉంది.
-ఒక ఎకరం విస్తీర్ణం గల అటవీ ప్రాంతం 19 మందికి ఏడాది పాటు కావాల్సిన ఆక్సిజన్‌ను అందిస్తుంది. 
-గ్రేటర్‌లో కోటికి పైగా జనాభా ఉండగా, ఇక్కడ ఆక్సిజన్ పీల్చుకోవడానికి 13 లక్షల చెట్లు ఉండాలి. 

హైదరాబాద్ మక్కా మసీదు భక్తికి ప్రతీక !

హైదరాబాద్  మక్కా మసీదు భక్తికి ప్రతీక !
77 ఏళ్ల పాటు నిర్మాణం
-170 అడుగుల ఎత్తు
-ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జుమ్మతుల్ విదా
-ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : నగరంలోని చారిత్రక కట్టడాల్లో అతి ప్రాచీనమైంది మక్కా మసీదు. నగరంలో ఉన్న ఇతర చారిత్రక మసీదుల కంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి నగర సందర్శనకు వచ్చే వారు చార్మినార్‌ను చూసిన తర్వాత పక్కనే ఉన్న ఈ మసీదును తప్పక దర్శిస్తారు. కాగా, రంజాన్ మాసంలో ఈ మసీదు ప్రత్యేక కళను సంతరించుకుంటుంది.

మక్కా మసీదులో రంజాన్ కళ
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలు మక్కా మసీదులో ప్రార్థనలు చేయడానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. సాధారణ రోజుల్లో కన్నా రంజాన్ మాసంలో మక్కా మసీదులో ప్రార్థనలు నిర్వహించే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. రంజాన్ చివరి శుక్రవారం జుమ్మతుల్ విదా సందర్భంగా నగరంతో పాటు ఇతర జిల్లాల, రాష్ర్టాల నుంచి మక్కా మసీదులో ప్రార్థనలు చేయడానికి అధిక సంఖ్యలో ముస్లింలు వస్తారు. జుమ్మతుల్ విదా రోజు మక్కా మసీదు ప్రాంగణంతో పాటు ఇటు గుల్జార్‌హౌస్, చార్‌కమాన్ అటు శాలిబండా వరకు బారులు తీరి ప్రత్యేప్రార్థనలు చేస్తారు.

మత సామరస్యానికి ప్రతీక
మక్కా మసీదు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అద్భుత రాతి కట్టడంలో ఆనాటి శిల్ప కళానైపుణ్యం ఉట్టిపడుతుంది. మక్కా మసీదు నిర్మాణం కోసం 1617లో సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా శంకుస్థాపన చేశారు. సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా అనంతరం హైదరాబాద్‌ను పరిపాలించిన కుతుబ్‌షా రాజులైన అబ్దుల్లా కుతుబ్‌షా, అబ్దులా హసన్ తానీషాల అనంతరం పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటికి దీని నిర్మాణం పూర్తయింది.

1694లో ఔరంగజేబు మక్కామసీదును ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మక్కా మసీదు నిర్మాణంలో ఎక్కడ మట్టిని వాడకుండా కేవలం రాళ్లు, రాళ్ల పొడిని మాత్రమే వినియోగించారు. దాదాపు 8 వేల మంది కార్మికులు పని చేశారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు సమీపంలోని ఒక పెద్ద రాతి కొండను పగుల కొట్టి అక్కడి నుంచి ఎడ్ల బండ్లపై తీసుకొచ్చిన రాళ్లతో ఈ మసీదు నిర్మించారు.

ఎత్తు 170 అడుగులు..
మక్కా మసీదు ఎత్తు దాదాపు 170 అడుగులు. మసీదు లోపల సుమారు మూడు వేల మంది ఒకేసారి కూర్చొని ఇక్కడ సామూహిక ప్రార్థనలు చేసుకోవచ్చు. అంతేకాకుండా మసీదు ప్రాంగణంలో దాదాపు 10 వేల మంది సామూహిక ప్రార్థనలు చేసుకోవడానికి వీలుంది. 170 అడుగుల పొడవు గల రాతి పిల్లర్ల ఏర్పాటు కోసం ఆనాడు 12 అడుగుల వెడల్పుతో 35 అడుగుల లోతు వరకు పునాదులు తీశారు.

మసీదుల లోపల..
మసీదు లోపల మహ్మద్ ప్రవక్తకు చెందిన పవిత్రమైన వస్తువులు కొన్ని ఉంచారని చెబుతున్నారు. ప్రధాన మసీదు ప్రాంగణానికి దక్షిణాన ఐదుగురు అసఫ్‌జాహీ రాజులకు సంబంధించి 14 సమాధులు ఉన్నాయి. మక్కా మసీదు ప్రార్థనా మందిరంలోని అతి పెద్ద షాండిలీయర్ విద్యుత్ కాంతులతో దేదిప్యమానంగా వెలుగుతుంటుంది. నమాజ్ చేయాల్సిన సమాయాన్ని సూచిస్తూ ఐదు రకాల ప్రత్యేక గడియారాలున్నాయి. దీని నిర్వహణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ చూస్తోంది. ఏటా రంజాన్ సందర్భంగా ఇక్కడ సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది.

ముస్లింలు ఆరాధనల్లో గడపాలి
రంజాన్ మాసంలో ఒక నిమిషాన్ని కూడా వృథా చేయకుండా ముస్లింలు ఆరాధనల్లో గడపాలి ఈ మాసంలో ఒక పుణ్యకార్యం చేస్తే దానికి 70 రెట్ల పుణ్యం దక్కుతుంది. ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష పాటించాలి. ఖురాన్‌ను చదివి దానికనుగుణంగా జీవితాలను గడిపి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. పేదలకు ఎక్కువగా దానధర్మాలు, సహారీ, ఇఫ్తార్లు ఏర్పాట్లు చేసి, ఆదుకోవాలి.
- మౌలానా హఫేజ్ పీర్ షబ్బీర్, జమీయతే ఉలేమా రాష్ట్ర అధ్యక్షుడు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఐ కెమెరా

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఐ కెమెరా

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇక కళ్లలో కెమెరాలు పెట్టుకొని విధులు నిర్వహించనున్నారు. దేశంలో తొలిసారిగా ఈ తరహ విధులు నిర్వహించడం సైబరాబాద్‌లో మొదలైంది. ట్రాఫిక్ పోలీసుల విధుల్లో పారదర్శకత తీసుకురావడానికి సీపీ సీవీ ఆనంద్ కృషితో సరికొత్త టెక్నాలజీతో ఐ వోర్న్ కెమెరాలను గురువారం నుంచి ప్రవేశపెట్టారు. ఈ ఐ వోర్న్ కెమెరాల్లో అత్యాధునిక టెక్నాలజీ అంశాలను పొందుపర్చడంతో విధుల్లో ఉన్న ట్రాఫిక్ అధికారితో పాటు వాహనదారుడి మాటలను సైతం రికార్డు చేస్తుంది. ఒక వైపే కాకుండా టూ సైడ్స్ రికార్డింగ్ అవకాశాన్ని ఈ కెమెరాల్లో పొందుపర్చారు. దీంతో ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు అధికారి తప్పు చేసినా, వాహనదారుడు తప్పు చేసినా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పటి వరకు బాడీ వోర్న్ కెమెరాలతో విధులు నిర్వహించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఐ వోర్న్ కెమెరాలతో డ్యూటీని చేయనున్నారు. ఐ వోర్న్ కెమెరాలను మొదటి దశలో కూకట్‌పల్లి, మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్‌లోని ఏడుగురు ఇన్‌స్పెక్టర్లకు అందించారు.

చుడువ టైం పాస్...............

చుడువ టైం పాస్...............
 Hyderabad రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌లో చుడువబస్తీ
పికెట్ : నెక్లెస్‌రోడ్.. ట్యాంక్‌బండ్.. ఇందిరాపార్క్.. సంజీవయ్యపార్క్.. రైల్వేస్టేషన్.. బస్టాండ్.. ఇలా నగరంలో ప్రతి చోట టైం పాస్ కోసం అందరు తినేదే చుడువ.. ప్రతి పార్కులో చుడువా.. చుడువా.. అంటూ మనల్ని ఆప్యాయంగా పలకరించి అమ్ముకునే వారిని చూస్తునే ఉంటాం. చుడవ బుట్టలు నెత్త్తిన పెట్టుకోని ఇలా అమ్ముకునే వారు నగరంలో చాలా మంది ఉన్నారు. ఇదే వారి జీవనాధరం.

చుడువబస్తీలో 500 కుటుంబాలు
ఇంత పెద్ద హైదరాబాద్‌లో పాతబస్తీ, సింధికాలనీ, గుజరాత్‌కాలనీ, పార్సిగుట్ట, బ్రహ్మణబస్తీ, మేదరబస్తీ, కుమ్మరి బస్తీలు ఉన్నట్లే చుడవ బస్తీ కూడా ఉంది. సికింద్రాబాద్ రసూల్‌పురాలోని ఇందిరమ్మనగర్‌లో ఈ చుడువ బస్తీ వెలిసింది. ఇక్కడ సుమారు 500 కుటుంబాలు చుడువ అమ్ముకునే జీవిస్తున్నాయి. ఇంట్లోనే ఉడకబెట్టిన శనిగలు, మరమరాలు, పల్లీలు, ఉల్లిగడ్డ కలుపుకుని ఒక బుట్టలో వేసుకుని రోజు ఉదయం బయటికి వెళతారు. పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ ఇలా జనం ఉన్న ప్రాంతాల్లో వాటిని అమ్ముకుని సాయంత్రం ఇంటికి చేరుతారు. నగరంలో ఎన్నికలు వచ్చినపుడు, బహిరంగ సభలు జరిగిప్పుడు.. పార్టీ ఆఫీసుల వద్ద, పార్కులు, అత్యధికంగా జనాలు ఉన్నచోట, పంక్షన్‌హాళ్ల వద్ద తమ వ్యాపారం బాగా ఉంటుందని చుడువ వ్యాపారులు చెబుతున్నారు.

రూ. 40లక్షలకు టెండర్ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

రూ. 40లక్షలకు టెండర్ !!!!!!!!!!

బల్దియాలో కొనసాగుతున్న కన్సల్టెంట్ల హవా
జీహెచ్‌ఎంసీ వద్ద ఉన్న సమాచారంతోనే నివేదిక
బిల్లుకోసం ఓ ఉన్నతాధికారి ఒత్తిడి
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : కేంద్ర ప్రభుత్వ స్మార్ట్‌సిటీ పథకం నగరానికి అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ జీహెచ్‌ఎంసీకి మాత్రం దాన్నుంచి ఇంకా విముక్తి లభించలేదు. జీహెచ్‌ఎంసీ వద్ద ఉన్న సమాచారంతోనే ఓ పుస్తకాన్ని ముద్రించి స్మార్ట్‌సిటీ పేరుతో రూ. 40లక్షలు స్వాహా చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. ఈ మేరకు కన్సల్టెంటుకు బిల్లులు చెల్లించాలని ప్రతిపాదనలు సిద్ధంచేసిన ఓ ఉన్నతాధికారి వెంటనే జారీ అయ్యే విధంగా ఇతర అధికారులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం. 

స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా ఏమి చేయబోతున్నామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తే కేంద్రం దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదనలనుంచి అత్యుత్తమ వాటిని ఎంపిక చేసి స్మార్ట్‌సిటీ పథకానికి అవకాశం ఇస్తుంది. ఇందులో భాగంగా మన నగరం నుంచి మురికివాడల నిర్మూలన, డబుల్ బెడ్‌రూమ్, ఈ-ఆఫీసు తదితర ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించేందుకు నైట్‌ఫ్రాంక్ అనే కన్సల్టెంటుతో దాదాపు ఏడాది క్రితం సుమారు రూ. 40లక్షలకు ఒప్పందం చేసుకుంది. 

నగరంలోనూ ట్రామ్‌లు!

నగరంలోనూ ట్రామ్‌లు...................

హైదరాబాద్ రోడ్లపై రైళ్లు పరుగెత్తనున్నాయి..! ఇదేమిటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే..కోల్‌కతా మాదిరి మన నగరంలోనూ ట్రామ్‌లు నడిపించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మేయర్ రామ్మోహన్ నేతృత్వంలోని జీహెచ్‌ఎంసీ బృందం అక్కడి బోర్డాక్స్ నగరంలో ట్రామ్స్ రవాణాపై సమగ్ర అధ్యయనం చేసింది. 

ఈ మేరకు మన నగరంలో మెట్రోరైలు మార్గం లేని ప్రధాన రోడ్లు.. ముఖ్యంగా శివారు ప్రాంతాల నుంచి నగరాన్ని కలిపే రహదారులపై ట్రామ్‌లు నడిపితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. మెట్రోతో పోల్చితే వీటి ఖర్చు కూడా తక్కువ కావడంతో సాధ్యాసాధ్యాలపై ప్రాథమికంగా ఓ రిపోర్ట్ తయారు చేశారు. త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. 

కోల్‌కతా మాదిరి ట్రామ్ ట్రైన్లు త్వరలో నగరంలోనూ నడిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ అంశం భవిష్యత్తులో నిజమైనా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. మెట్రోరైలు మార్గంలేని ప్రధాన రోడ్లు, ముఖ్యంగా శివారు ప్రాంతాలనుంచి నగరాన్ని కలిపే రహదారుల్లో వీటిని నడిపితే బావుంటుందని వారి యోచన. నగరంలో వీటి సాధ్యాసాధ్యాలపై ఓ అంచనాతో అధికారులు ప్రాథమికంగా ఓ నివేదికను తయారుచేశారు. 

రోడ్డుపై పట్టాలుండి వాటిపై నడిచే చిన్నపాటి రైళ్లను ట్రామ్‌లుగా పిలుస్తారు. వీటిపై రైళ్లతోపాటు బస్సులు, ఇతర వాహనాలు కూడా యథావిధిగా నడిచే వీలుంటుంది. అయితే అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు. ప్రస్తుతం కోల్‌కతాలో కొన్ని ఎంపికచేసిన మార్గాల్లో ఇవి నడుస్తున్నాయి. విదేశాల్లో వీటి వినియోగం విరివిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

ఇటీవల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మేయర్ రామ్మోహన్ నేతృత్వంలోని జీహెచ్‌ఎంసీ బృందం అక్కడి బోర్డాక్స్ నగరంలో ట్రామ్స్ రవాణాపై సమగ్ర అధ్యయనం చేసింది. అక్కడ ఏడాదిలో సుమారు 65వేల కిలోమీటర్లమేర ట్రామ్స్ నడుస్తున్నట్లు వారు గుర్తించారు. సదరు నగరంలో దాదాపు 80శాతంమంది ప్రజారవాణాపైనే ఆధారపడుతున్నట్లు వారు తెలుసుకున్నారు. అంతేకాదు, ఏడాదిలో సగటున ఒక్కరు మాత్రమే చనిపోతున్నట్లు గుర్తించారు. 

మెట్రోరైలుతో పోల్చుకుంటే ఖర్చు కూడా ఎంతో తక్కువని తేలింది. ఈ నేపథ్యంలో మన నగరానికి ఇవి అనుకూలంగా ఉంటాయని మేయర్ సహా అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 72కిలోమీటర్ల పొడవున మెట్రోరైలు మార్గాలు ఏర్పాటు చేస్తున్నందున అవి మినహా మిగిలిన ప్రధాన రోడ్లు, నగరానికి శివారు ప్రాంతాలతో అనుసంధానం చేసే రహదారుల్లో వీటిని ఏర్పాటుచేసే అంశాన్ని వారు పరిశీలిస్తున్నారు. 

ఎక్కువగా రోడ్డు విస్తరణ లేకుండా ఉన్న రోడ్లపైనే వీటిని ఏర్పాటుచేసే అవకాశం ఉందని, వీటివల్ల ఒకేసారి దాదాపు 300మందిని ఒకచోటినుంచి మరో చోటికి చేర్చవచ్చని, పట్టాలపై వెళ్తాయి కనుక ఇంధన వినియోగం తక్కువగా ఉంటుందని, విద్యుత్‌తో కూడా నడపవచ్చని, బస్సుతో పోల్చుకుంటే రవాణా ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని వారు భావిస్తున్నారు. 

నగరంలో వీటి వల్ల ఏ మేరకు ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది, ట్రాఫిక్ సమస్యలు ఎంతవరకు తగ్గించవచ్చు తదితర అంశాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఓ నివేదికను తయారుచేశారు. దీన్ని ఎలా చేపట్టాలి, ప్రైవేటు భాగస్వామ్యం తీసుకోవాలా? లేక ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే అవకాశం ఏ మేరకు ఉంది అనే అంశాలను పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తారు. అనంతరం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

rail accident 5 june.

Today chennai to ahmedabad navajeevan express
got accident just 2 hrs back plz share to all
reach the infrmtn to their families...

బేఫిక‌ర్‌గా 23 కిస్సులు

 బాలీవుడ్‌లో కిస్సుల కింగ్ ఇమ్రాన్ హ‌ష్మికి పోటీ బాగా పెరిగిపోతోంది. గ‌తంలో అత‌ని సినిమాలు కేవ‌లం ముద్దుల కోస‌మే చూసేవారు అభిమానులు. అత‌న్ని ఆద‌ర్శంగా తీసుకొని ఇప్పుడు ప్ర‌తి సినిమాలో క‌నీసం ఒక్క‌టైన లిప్‌లాక్ సీన్ పెడుతున్నారు. తాజాగా ర‌ణ్‌వీర్‌సింగ్‌, వాణిక‌పూర్ జంట‌గా వ‌స్తున్న బేఫిక‌ర్ సినిమాలో ఇలాంటి లిప్‌లాక్‌ సీన్లు ఏకంగా 23 ఉన్నాయ‌ట‌. ఫ‌స్ట్‌లుక్ అంటూ రిలీజ్ చేసిన మూడు పోస్ట‌ర్లు చూస్తే విష‌యం మీకే అర్థ‌మ‌వుతుంది. 

Long wait for US visas as consulate lacks staff

Long wait for US visas as consulate lacks staff:


HYDERABAD: If you have applied for a US visa and have been waiting for a long time to get an appointment for an interview, yours is not a lone case. The US Consulate Gen eral office in Hyderabad is facing an acute shortage of staff and with the number of applications mounting by , the situation may not get better anytime soon. "While we plan to shift to new consulate by 2020, we have asked the government of India to allow us to appoint more consular officers so that the waiting period can be reduced," said B Jamison Fouss, the chief consular officer at a media conference at the US Consulate General in Hyderabad on Thursday.
Speaking about the staff crunch, Foss, said, "There are only seven to 10 consular officers to review nearly 700 to 1,000 applications per day. Due to shortage of staff, there is higher waiting period during the peak season.
Each consular of ficer interviews an applicant for about two to three minutes," said Fouss. He added that for the kind of visa applications influx in Hyderabad, nearly 20 more consular officers were required. The consulate has been planning to increase counsellor windows to 51 from the 16 at the new office.
The American consulate in the city issued the highest number of student visas in India between July 2014 and July 2015, so much so, Hyderabad was ranked the fourth highest in the world in terms of number of student visas issued during the period.

Kacheguda-Guntur intercity may well be on its way out

Kacheguda-Guntur intercity may well be on its way out:

గుంటూరు: రెండు సంవత్సరాల క్రితం హైప్ మరియు hoopla నడుమ ప్రయోగించిన డబుల్ డెక్కర్, కాచిగూడ, గుంటూరు మధ్య సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు, బయటకు రాబోతుంది బాగా కావచ్చు. సాంకేతిక కారణాల, దక్షిణ మధ్య రైల్వే (SCR) జూన్ 30 జూన్ 11 నుంచి రైలులో సస్పెండ్ చేసింది.
అధికారులు రైలు 20 రోజులు నడుపుతారు కాదని చూపినప్పటికీ, నివేదికలు వారు నిజానికి నిరవధికంగా రోజు సమయం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రద్దు ప్రణాళికా చెప్పటానికి. హైదరాబాద్ తో గుంటూరు అనుసంధానించే రైలు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ ఆకులు మరియు రాత్రి 10.40 గంటలకు ఇక్కడ వస్తాడు. వ్యతిరేక దిశలో, నిష్క్రమణ సమయం 12.45 గంటలకు మరియు వద్ద 5.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
నివేదికలు SCR కారణంగా డబుల్ డెక్కర్ రైలు 2014 అధికారులు ట్రాఫిక్ కారణంగా కోర్సు లో తీయటానికి అని భావించింది మరియు దాని కార్యకలాపాలు కొనసాగాయి ప్రారంభించింది అప్పటి నుండి పేద ప్రాపకం వలన నష్టం తగిలాయి చెబుతున్నారు. అయితే, అధికారులు ఇప్పుడు ఆశ కోల్పోయింది మరియు ఇతర విభాగాలకు డబుల్ డెక్కర్ రైలు వెళ్లేందుకు చేశారు.
"కాచిగూడ-గుంటూరు ఇంటర్సిటీ అన్ని ఎయిర్ కండిషన్డ్ శిక్షకులు ఉంది. ఈ దూరంగా ఉంచాలని సాధారణ ప్రయాణికులు చేసింది," ఒక అధికారి ఇలా. ఎక్స్ప్రెస్ రైళ్లలో రెండో తరగతి సీటింగ్ ఛార్జీల కేవలం Rs155 కాగా, ఎసి గుంటూరు, సికింద్రాబాద్ మధ్య ఎక్స్ప్రెస్ డబుల్ డెక్కర్ చార్జీలు Rs465 ఉంది.

Thursday 9 June 2016

హౌ టు మేక్ హైదరాబాదీ దమ్ బిర్యాని:


హౌ టు మేక్ హైదరాబాదీ దమ్ బిర్యాని:


చికెన్ శుభ్రం మరియు కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, చికెన్ మసాలా, పెరుగు జోడించవచ్చు మరియు 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
తగినంత నూనె వేసి మెత్తగా తరిగిన బంగారు రంగు వచ్చే వరకు ఉల్లిపాయలు జోడించండి.
చమురు నుండి తొలగించండి.
ఇప్పుడు ఆ నూనె లో marinated చికెన్ డ్రాప్ మరియు పక్కన పెట్టుకోవాలి.
మరొక ఓడ బియ్యం తీసుకోండి మొత్తం గరం మసాలా, బిర్యానీ ఆకులు, ఉప్పు జోడించి ఉడికించాలి అనుమతిస్తాయి.
అన్నం సగం వండుతారు చేసినప్పుడు, వక్రీకరించు.
చికెన్ ఉడికించాలి మరియు పుదినా, కొత్తిమీర ఆకులు జోడించండి.
సగం ఉడికించిన అన్నం మరియు వేయించిన ఉల్లిపాయలు జోడించండి.
పొర ద్వారా మిగిలిన బియ్యం, ఉల్లిపాయలు లేయర్ వేసి ఒక మూత నౌకను కవర్ (ఒత్తిడి బయటకు వెళ్ళడానికి అనుమతిస్తుంది లేదు). జ్వాల తగ్గించడానికి మరియు 40 నిమిషాలు ఉడికించాలి.
చివరగా, బియ్యం లో చేసిన చిన్న రంధ్రాల ద్వారా పసుపు తో కలిపి నిమ్మ రసం జోడించండి.
రైత తో సర్వ్.

హైదరాబాదీ దమ్ బిర్యాని

హైదరాబాదీ దమ్ బిర్యాని హైదరాబాద్ స్థానికులను భారతదేశం నుండి ప్రపంచ ప్రసిద్ధ వంటకం ఉంది. ఈ మాంసాహార రుచికరమైన ఇదే ఒక పెద్ద భోజనం ఒక ప్రామాణికమైన హైదరాబాదీ అన్నం తయారీ ఉంది.

చేస్తుంది సున్నితమైన బియ్యం, చికెన్ కలిపి సుగంధ రుచులు కలిసి వ్యతిరేకించటం కష్టం అని ఒక సుగంధ కలయిక. ఎలా ఈ బిర్యాని రెసిపీ చేయడానికి ఎలా? చికెన్ మరియు బాస్మతి బియ్యం - ఈ అన్నం రెండు ప్రధాన అంశాలు. మిగిలిన ఈ అనుకూలత ఆనందం సృష్టించడానికి పదార్థాలు మరియు మసాలా మిక్స్ తో చుట్టూ నటిస్తున్నారు.

ఇది ఇలానే హైదరాబాద్ స్థానికులు మరియు పర్యాటకులు ఇష్టపడతారు. ప్రజలు ఈ డిష్ రుచి హైదరాబాద్ అన్ని మార్గం వెళ్ళి ఉండవచ్చు అయితే, మీరు ఏ సమయంలో మీ స్వంత వంటగదిలో ఈ చేయవచ్చు

గోల్కొండ ఫోర్ట్

గోల్కొండ ఫోర్ట్:
గోల్కొండ ఫోర్ట్ (కొన్నిసార్లు గోల్కొండ అని కూడా పలుకుతారు) 16 వ శతాబ్దం వరకు 14 వర్థిల్లుతున్నాయి గోల్కొండ పురాతన సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. 87 పాక్షిక వృత్తాకార bastions, ఎత్తు కొన్ని చేరే 60 అడుగులు తెంపి ఒక నల్లరాయి కొండపై 400 అడుగుల ఎత్తులో అని నిర్మించబడింది 17 నుంచి 34 అడుగుల నుండి మొదలుకొని గోడలు, అది భారతదేశం యొక్క అత్యంత అద్భుతమైన కోట సముదాయాలలో ఒకటిగా మిగిలిపోయింది.
చరిత్ర

గోల్కొండ రాజ్యం ప్రాముఖ్యత పెరిగింది మునుపే, కోట ప్రారంభంలో కాకతీయ రాజవంశం ప్రాంతంలో పరిపాలించాడు, 1143 లో భావించబడేది. పురాణం ప్రకారం, ఒక గొర్రెల కాపరి ప్రాంతంలో ఒక విగ్రహం దొరకలేదు. ఈ Kakatiyan రాజు నివేదించబడింది చేసినప్పుడు, అతను ఒక మట్టి కోటను దాని చుట్టూ నిర్మించిన ఆదేశించారు. కోటను చివరికి దీనిలో వీరిని తెలుగు షెపర్డ్ యొక్క హిల్ అర్థం గొల్ల కొండా పేరొందింది. ప్రాంతం చివరికి చివరికి ఇస్లామిక్ బహమనీ సుల్తానుల కోట విజయం ముగిశాయి, మూడు రాజ్యాల మధ్య వేడిపుట్టించే యుద్ధభూమిగా మారింది సుల్తానేట్ ప్రధాన ప్రావిన్స్ యొక్క రాజధానిగా మారింది. కులీ కుతుబ్ షా 1518 లో బహమనీ సుల్తానుల నుంచి స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు, కుతుబ్ షాహి రాజవంశం లేచి గోల్కొండ శక్తి దాని స్థానంగా అయ్యింది. దశాబ్దాల తదుపరి రెండు వరుస కుతుబ్ షాహి రాజుల మట్టి కోటను గ్రానైట్ ఒక భారీ మరియు విస్తారమైన కోట, చుట్టూ 5 కిలోమీటర్ల వరకు విస్తరించివున్న ఒక చుట్టుకొలత కూడా విస్తరించింది. కోటను కోటను అప్పుడు నగరం పరివేష్టిత ఒక 10 కిలోమీటర్ల వెలుపలి గోడను కలిగి విస్తరించారు ఇది 1590 వ సంవత్సరంలో హైదరాబాద్ కు తరలించారు వరకు వంశ రాజధానిగా కొనసాగింది.
1686 లో మొఘల్ ప్రిన్స్ ఔరంగజేబు Hydebarad, కుతుబ్ షాహి వంశస్తులు సంపన్నులు రాజధానిగా పేర్కొంటూ ఉద్దేశంతో గోల్కొండ కోటను ముట్టడి లే ప్రారంభించారు. కోట దాని ఖ్యాతిని పేర్కొన్నారు అంత దుర్భేద్యమైన నిరూపించబడింది. ఇది 1687, ఔరంగజేబు చివరికి ఒక తొమ్మిది నెలల ముట్టడి తర్వాత కోటను మించే నిర్వహించేది లో, సంవత్సరం తర్వాత వరకు కాదు. ఇది కోటను మాత్రమే ఎందుకంటే గేట్ చెడగొట్టినట్లు ఒక దేశద్రోహి పడిపోయింది చెప్పబడింది.
కోట ఈనాడు


నేడు, దాదాపు 800 సంవత్సరాల తర్వాత, కోట ఇప్పటికీ హైదరాబాద్ యొక్క గొప్ప శిల్పకళా అద్భుతాలలో ఒకటిగా నిలుస్తుంది. ఒకరి gratest ఇంజనీరింగ్ అద్భుతాలను అద్భుతమైన శబ్ద ప్రభావాలను: ప్రవేశ గోపురం దిగువన ఒక నిర్దిష్ట సమయంలో ఒక handclap దాదాపు ఒక కిలోమీటరు దూరంలో పెవిలియన్ అత్యధిక సమయంలో వినవచ్చు. ఈ దాడి విషయంలో రాయల్స్ హెచ్చరించానని ఉపయోగిస్తారు చెప్పబడింది

తాజ్ ఫలక్నుమా ప్యాలెస్

హైదరాబాద్ పైన 610 మీటర్ల ఎత్తున్న ఈ విలాసవంతమైన 5-స్టార్ ప్రాపర్టీ వలస మరియు భారత నమూనాలు మిశ్రమం కలిగి. ఇది ప్రపంచవ్యాప్తంగా నుండి అందంగా చెక్కబడిన వస్తువులు మరియు మొదటి తరగతి స్పా ఒక వారసత్వం నడక ఉన్నాయి.

అధిక చెక్క ప్రసారమయ్యేవి పైకప్పులు నటించిన ఈ విశాలమైన గదులు పాస్టెల్ షేడ్స్, పుష్ప బట్టలు మరియు జరిమానా చెక్క అమరికలు నమోదిత. రూం సుఖాలు బొంతలు మరియు ఈజిప్టు ప్రత్తి నార డౌన్ ఉన్నాయి.

విరామ మధ్యాహ్నాలు ఓక్ ఫలకాల పాలెస్ లైబ్రరీ లేదా బిలియర్డ్స్ రూమ్ లో ఖర్చు చేయవచ్చు. ఇతర లక్షణాలు ఒక భూదృశ్య పూల్, ఫిట్నెస్ సౌకర్యాలు మరియు బెస్పోక్ కుట్టుపని ఉన్నాయి.

తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ అందమైన చార్మినార్ స్మారక మరియు Chaumallah ప్యాలెస్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఉచిత పార్కింగ్ అందించటం, అది రాజీవ్ మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు బంజారా హిల్స్ నుండి ఒక 20 నిమిషాల డ్రైవ్ గురించి.

జంభం 6 భోజనాల ఎంపికలు, ముఖ్యాంశాలు జాడే రూమ్ లో మధ్యాహ్నం టీ మరియు హుక్కా లాంజ్ సడలించడం సెషన్స్ ఉన్నాయి. ఒక ఇటాలియన్ రెస్టారెంట్ మరియు poolside బార్ కూడా ఉంది.

మేము మీ భాషా మాట్లాడటం!

తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ 17 నుండి Booking.com అతిథులు స్వాగతించే చేయబడింది Aug 2011
హోటల్ రూములు: 60, హోటల్ చైన్ తాజ్ హోటల్స్, రిసార్ట్స్ మరియు రాజభవనాలు








Next Month Telangana to have a new English daily


 Next Month Telangana to have a new English daily

Telangana Today will be the second publication from Telangana Publications, the company in which the CM has an investment of a little over Rs 4 crore

ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ............


ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ............

దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే కొనసాగుతుందన్న నమ్మకాన్ని రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యక్తంచేశారు. ఈ ఏడాది సానుకూల వర్షాలు కురియనుండటం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాం డ్ ఊపందుకోవడం, ప్రజల పెట్టుబడులు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందని ప్రైవేట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ పేర్కొన్నారు. 

(జననీ సేవ ) శిశువులకు వేడి పాలు రైల్వేలో:................

జననీ సేవను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ.. శిశువులు, బాలింతకలకు జననీ సేవ ఉపయోపడుతుందన్నారు. తొలి దశలో 25 రైల్వే స్టేషన్లలో వేడిపాలు, వేడి నీళ్లతో పాటు శిశువులకు అవసరమయ్యే వస్తువులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు ప్రత్యేక ఆహార మెనూ ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. రాజధాని, శతాబ్ది రైళ్ల టికెట్లలో తప్పనిసరి ఆహార నిబంధన సడలింపు చేస్తున్నట్లు తెలిపారు. శిశువుకు పాలు దొరక లేదంటూ ఓ బాలింత తనకు ట్వీట్ చేసిందని గుర్తు చేశారు. శిశువుకు వెంటనే పాలు అందేలా ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా మంది తల్లులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇబ్బందుల దృష్ట్యా అందరికీ ఉపయోగపడేలా జననీ సేవ ప్రారంభించామని స్పష్టం చేశారు.

దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా జ్యోతి

మెదక్ జిల్లా దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా జ్యోతి నిమాయకమయ్యారు. మెదక్ జిల్లా మిరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాపురెడ్డి, మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రాజేశ్వర్ ను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా జ్యోతి

దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా జ్యోతి