Friday 10 June 2016

అవమానించారు.........................


అవమానించారు..........







anju


 SPORTS.. మంత్రిపై అంజూ ఆరోపణ
తిరువనంతపురం: కేరళ క్రీడల మంత్రి ఈపీ జయరాజన్ తనను అవమానించారని ఒలింపియన్, భారత మాజీ మహిళా లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జ్ ఆరోపించింది. కేరళకే చెందిన అంజూ ప్రస్తుతం ఆ రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే, కౌన్సిల్ చీఫ్ హోదాలో అవినీతికి పాల్పడ్డానంటూ తనను తీవ్రంగా అవమానించారని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అంజూ ఫిర్యాదు చేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఈనెల 7న కౌన్సిల్ ఉపాధ్యక్షునితో కలిసి నేను క్రీడలమంత్రి జయరాజన్‌ను అభినందించేందుకు వెళ్లాను. అయితే, ఆయన రాష్ట్ర క్రీడల గురించేమైనా మాట్లాడుతారేమో అని అనుకున్నాను. 

కానీ, మీరంతా గత ప్రభుత్వం ద్వారా స్పోర్ట్స్ కౌన్సిల్‌కు ఎన్నికైనవాళ్లు. మీ నియామకాలన్నీ చట్ట విరుద్ధంగా జరిగాయి. మీ హయాంలో విమాన చార్జీలతో పాటు పలు విషయాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ పరుషంగా మాట్లాడారు అని అంజూ మీడియాతో చెప్పింది. అయితే, క్రీడల మంత్రి మాటలను ముఖ్యమంత్రి విజయన్ సమర్థించడం గమనార్హం. విమాన టిక్కెట్ల గురించి అడిగితే, అవమానించడమెలా అవుతుందని మీడియాతో విజయన్ పేర్కొన్నారు. 39ఏండ్ల అంజూ 2003లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది.

No comments:

Post a Comment