Friday 10 June 2016

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఐ కెమెరా

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఐ కెమెరా

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇక కళ్లలో కెమెరాలు పెట్టుకొని విధులు నిర్వహించనున్నారు. దేశంలో తొలిసారిగా ఈ తరహ విధులు నిర్వహించడం సైబరాబాద్‌లో మొదలైంది. ట్రాఫిక్ పోలీసుల విధుల్లో పారదర్శకత తీసుకురావడానికి సీపీ సీవీ ఆనంద్ కృషితో సరికొత్త టెక్నాలజీతో ఐ వోర్న్ కెమెరాలను గురువారం నుంచి ప్రవేశపెట్టారు. ఈ ఐ వోర్న్ కెమెరాల్లో అత్యాధునిక టెక్నాలజీ అంశాలను పొందుపర్చడంతో విధుల్లో ఉన్న ట్రాఫిక్ అధికారితో పాటు వాహనదారుడి మాటలను సైతం రికార్డు చేస్తుంది. ఒక వైపే కాకుండా టూ సైడ్స్ రికార్డింగ్ అవకాశాన్ని ఈ కెమెరాల్లో పొందుపర్చారు. దీంతో ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు అధికారి తప్పు చేసినా, వాహనదారుడు తప్పు చేసినా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పటి వరకు బాడీ వోర్న్ కెమెరాలతో విధులు నిర్వహించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ఐ వోర్న్ కెమెరాలతో డ్యూటీని చేయనున్నారు. ఐ వోర్న్ కెమెరాలను మొదటి దశలో కూకట్‌పల్లి, మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్‌లోని ఏడుగురు ఇన్‌స్పెక్టర్లకు అందించారు.

No comments:

Post a Comment