Friday 10 June 2016

హైదరాబాద్ మక్కా మసీదు భక్తికి ప్రతీక !

హైదరాబాద్  మక్కా మసీదు భక్తికి ప్రతీక !
77 ఏళ్ల పాటు నిర్మాణం
-170 అడుగుల ఎత్తు
-ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జుమ్మతుల్ విదా
-ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : నగరంలోని చారిత్రక కట్టడాల్లో అతి ప్రాచీనమైంది మక్కా మసీదు. నగరంలో ఉన్న ఇతర చారిత్రక మసీదుల కంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి నగర సందర్శనకు వచ్చే వారు చార్మినార్‌ను చూసిన తర్వాత పక్కనే ఉన్న ఈ మసీదును తప్పక దర్శిస్తారు. కాగా, రంజాన్ మాసంలో ఈ మసీదు ప్రత్యేక కళను సంతరించుకుంటుంది.

మక్కా మసీదులో రంజాన్ కళ
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ప్రజలు మక్కా మసీదులో ప్రార్థనలు చేయడానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. సాధారణ రోజుల్లో కన్నా రంజాన్ మాసంలో మక్కా మసీదులో ప్రార్థనలు నిర్వహించే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. రంజాన్ చివరి శుక్రవారం జుమ్మతుల్ విదా సందర్భంగా నగరంతో పాటు ఇతర జిల్లాల, రాష్ర్టాల నుంచి మక్కా మసీదులో ప్రార్థనలు చేయడానికి అధిక సంఖ్యలో ముస్లింలు వస్తారు. జుమ్మతుల్ విదా రోజు మక్కా మసీదు ప్రాంగణంతో పాటు ఇటు గుల్జార్‌హౌస్, చార్‌కమాన్ అటు శాలిబండా వరకు బారులు తీరి ప్రత్యేప్రార్థనలు చేస్తారు.

మత సామరస్యానికి ప్రతీక
మక్కా మసీదు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అద్భుత రాతి కట్టడంలో ఆనాటి శిల్ప కళానైపుణ్యం ఉట్టిపడుతుంది. మక్కా మసీదు నిర్మాణం కోసం 1617లో సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా శంకుస్థాపన చేశారు. సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా అనంతరం హైదరాబాద్‌ను పరిపాలించిన కుతుబ్‌షా రాజులైన అబ్దుల్లా కుతుబ్‌షా, అబ్దులా హసన్ తానీషాల అనంతరం పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటికి దీని నిర్మాణం పూర్తయింది.

1694లో ఔరంగజేబు మక్కామసీదును ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మక్కా మసీదు నిర్మాణంలో ఎక్కడ మట్టిని వాడకుండా కేవలం రాళ్లు, రాళ్ల పొడిని మాత్రమే వినియోగించారు. దాదాపు 8 వేల మంది కార్మికులు పని చేశారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు సమీపంలోని ఒక పెద్ద రాతి కొండను పగుల కొట్టి అక్కడి నుంచి ఎడ్ల బండ్లపై తీసుకొచ్చిన రాళ్లతో ఈ మసీదు నిర్మించారు.

ఎత్తు 170 అడుగులు..
మక్కా మసీదు ఎత్తు దాదాపు 170 అడుగులు. మసీదు లోపల సుమారు మూడు వేల మంది ఒకేసారి కూర్చొని ఇక్కడ సామూహిక ప్రార్థనలు చేసుకోవచ్చు. అంతేకాకుండా మసీదు ప్రాంగణంలో దాదాపు 10 వేల మంది సామూహిక ప్రార్థనలు చేసుకోవడానికి వీలుంది. 170 అడుగుల పొడవు గల రాతి పిల్లర్ల ఏర్పాటు కోసం ఆనాడు 12 అడుగుల వెడల్పుతో 35 అడుగుల లోతు వరకు పునాదులు తీశారు.

మసీదుల లోపల..
మసీదు లోపల మహ్మద్ ప్రవక్తకు చెందిన పవిత్రమైన వస్తువులు కొన్ని ఉంచారని చెబుతున్నారు. ప్రధాన మసీదు ప్రాంగణానికి దక్షిణాన ఐదుగురు అసఫ్‌జాహీ రాజులకు సంబంధించి 14 సమాధులు ఉన్నాయి. మక్కా మసీదు ప్రార్థనా మందిరంలోని అతి పెద్ద షాండిలీయర్ విద్యుత్ కాంతులతో దేదిప్యమానంగా వెలుగుతుంటుంది. నమాజ్ చేయాల్సిన సమాయాన్ని సూచిస్తూ ఐదు రకాల ప్రత్యేక గడియారాలున్నాయి. దీని నిర్వహణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ చూస్తోంది. ఏటా రంజాన్ సందర్భంగా ఇక్కడ సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది.

ముస్లింలు ఆరాధనల్లో గడపాలి
రంజాన్ మాసంలో ఒక నిమిషాన్ని కూడా వృథా చేయకుండా ముస్లింలు ఆరాధనల్లో గడపాలి ఈ మాసంలో ఒక పుణ్యకార్యం చేస్తే దానికి 70 రెట్ల పుణ్యం దక్కుతుంది. ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష పాటించాలి. ఖురాన్‌ను చదివి దానికనుగుణంగా జీవితాలను గడిపి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. పేదలకు ఎక్కువగా దానధర్మాలు, సహారీ, ఇఫ్తార్లు ఏర్పాట్లు చేసి, ఆదుకోవాలి.
- మౌలానా హఫేజ్ పీర్ షబ్బీర్, జమీయతే ఉలేమా రాష్ట్ర అధ్యక్షుడు.

5 comments:


  1. explorermax-crack is a powerful new Windows Explorer file management tool, with a modern and friendly interface, convincing users to give Windows Explorer a try.
    freeprokeys

    ReplyDelete
  2. https://newhyderabadnews.blogspot.com/2016/06/blog-post_59.html?showComment=1539308424900#c7156706338141165980

    ReplyDelete
  3. Tenorshare Ultdata Windows Crack is a program that assists individuals with further developing their composing abilities. It has been generally welcomed by PC clients who have viewed it as a compelling instrument in further developing exactness and speed.

    ReplyDelete