Friday 10 June 2016

రూ. 40లక్షలకు టెండర్ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

రూ. 40లక్షలకు టెండర్ !!!!!!!!!!

బల్దియాలో కొనసాగుతున్న కన్సల్టెంట్ల హవా
జీహెచ్‌ఎంసీ వద్ద ఉన్న సమాచారంతోనే నివేదిక
బిల్లుకోసం ఓ ఉన్నతాధికారి ఒత్తిడి
నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో : కేంద్ర ప్రభుత్వ స్మార్ట్‌సిటీ పథకం నగరానికి అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ జీహెచ్‌ఎంసీకి మాత్రం దాన్నుంచి ఇంకా విముక్తి లభించలేదు. జీహెచ్‌ఎంసీ వద్ద ఉన్న సమాచారంతోనే ఓ పుస్తకాన్ని ముద్రించి స్మార్ట్‌సిటీ పేరుతో రూ. 40లక్షలు స్వాహా చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. ఈ మేరకు కన్సల్టెంటుకు బిల్లులు చెల్లించాలని ప్రతిపాదనలు సిద్ధంచేసిన ఓ ఉన్నతాధికారి వెంటనే జారీ అయ్యే విధంగా ఇతర అధికారులపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం. 

స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా ఏమి చేయబోతున్నామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తే కేంద్రం దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదనలనుంచి అత్యుత్తమ వాటిని ఎంపిక చేసి స్మార్ట్‌సిటీ పథకానికి అవకాశం ఇస్తుంది. ఇందులో భాగంగా మన నగరం నుంచి మురికివాడల నిర్మూలన, డబుల్ బెడ్‌రూమ్, ఈ-ఆఫీసు తదితర ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించేందుకు నైట్‌ఫ్రాంక్ అనే కన్సల్టెంటుతో దాదాపు ఏడాది క్రితం సుమారు రూ. 40లక్షలకు ఒప్పందం చేసుకుంది. 

No comments:

Post a Comment