Friday 10 June 2016

చుడువ టైం పాస్...............

చుడువ టైం పాస్...............
 Hyderabad రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌లో చుడువబస్తీ
పికెట్ : నెక్లెస్‌రోడ్.. ట్యాంక్‌బండ్.. ఇందిరాపార్క్.. సంజీవయ్యపార్క్.. రైల్వేస్టేషన్.. బస్టాండ్.. ఇలా నగరంలో ప్రతి చోట టైం పాస్ కోసం అందరు తినేదే చుడువ.. ప్రతి పార్కులో చుడువా.. చుడువా.. అంటూ మనల్ని ఆప్యాయంగా పలకరించి అమ్ముకునే వారిని చూస్తునే ఉంటాం. చుడవ బుట్టలు నెత్త్తిన పెట్టుకోని ఇలా అమ్ముకునే వారు నగరంలో చాలా మంది ఉన్నారు. ఇదే వారి జీవనాధరం.

చుడువబస్తీలో 500 కుటుంబాలు
ఇంత పెద్ద హైదరాబాద్‌లో పాతబస్తీ, సింధికాలనీ, గుజరాత్‌కాలనీ, పార్సిగుట్ట, బ్రహ్మణబస్తీ, మేదరబస్తీ, కుమ్మరి బస్తీలు ఉన్నట్లే చుడవ బస్తీ కూడా ఉంది. సికింద్రాబాద్ రసూల్‌పురాలోని ఇందిరమ్మనగర్‌లో ఈ చుడువ బస్తీ వెలిసింది. ఇక్కడ సుమారు 500 కుటుంబాలు చుడువ అమ్ముకునే జీవిస్తున్నాయి. ఇంట్లోనే ఉడకబెట్టిన శనిగలు, మరమరాలు, పల్లీలు, ఉల్లిగడ్డ కలుపుకుని ఒక బుట్టలో వేసుకుని రోజు ఉదయం బయటికి వెళతారు. పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ ఇలా జనం ఉన్న ప్రాంతాల్లో వాటిని అమ్ముకుని సాయంత్రం ఇంటికి చేరుతారు. నగరంలో ఎన్నికలు వచ్చినపుడు, బహిరంగ సభలు జరిగిప్పుడు.. పార్టీ ఆఫీసుల వద్ద, పార్కులు, అత్యధికంగా జనాలు ఉన్నచోట, పంక్షన్‌హాళ్ల వద్ద తమ వ్యాపారం బాగా ఉంటుందని చుడువ వ్యాపారులు చెబుతున్నారు.

No comments:

Post a Comment