Friday 30 October 2015

22మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు


22మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదీలీలు భారీగా జరిగాయి. అన్ని ప్రభుత్వశాఖల ముఖ్య
కార్యదర్శులు, హెచ్‌వోడీలు, జీహెచ్‌ఎంసీలో మొత్తం 22మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారుల వివరాలు:

జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా అనితారామచంద్రన్
జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్‌గా బి జనార్ధన్ రెడ్డి
టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఎంవీ రెడ్డి
ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ లక్ష్మణ్
గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా సోమేశ్‌కుమార్
సమాచార పౌర సంబంధాల కమిషనర్‌గా నవీన్ మిట్టల్
హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా టీ చిరంజీవులు
అటవీ శాఖ ముఖ్యకార్యదర్శిగా వికాస్‌రాజ్
సీసీఎల్‌గా రేమండ్ పీటర్
జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శిగా అధర్ సిన్హా
సాధారణ పరిపాలనశాఖకు శాలినీ మిశ్రా
పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండీగా కే నిర్మల
ఆయిల్ ఫెడ్ వీసీ అండ్ ఎండీగా ఎ మురళి
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా రాజేశ్వర్ తివారీ,
పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేశ్‌చందా
బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా జీడీ అరుణ
ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా మహేశ్‌దత్
పురపాలక శాఖ సంయుక్త కార్యదర్శిగా ఎ శ్రీనివాస్
పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్‌పీ సింగ్
పురపాలక శాఖ కమిషనర్‌గా దాన కిషోర్
సెర్స్ సీఈవోగా వీరబ్రహ్మయ్యకు అదనపు బాధ్యతలు
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా జీ కిషన్

No comments:

Post a Comment