Friday 30 October 2015

Brain stroke పై అవగాహన అవసరం..

దేశంలో పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని యశోద హాస్పిటల్ సీనియర్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ జీ రాజశేఖర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్‌వంటి కారణాలతో నగరాల్లో ఎక్కువమంది ఈ జబ్బు బారిన పడుతున్నారని అన్నారు. పక్షవాతంపై సరైన అవగాహన లేకపోవడం కారణంగా ఎంతో మంది మృత్యువాతపడుతున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ వైద్యులు నిర్వహించిన సర్వేలో ధూమపానం వల్ల 35శాతం మంది (7శాతం మహిళలు), మద్యపానం వల్ల 26 శాతం మంది, హైపర్‌టెన్షన్ వల్ల 26శాతం మంది, మధుమేహం వల్ల 16శాతం, ఊబకాయం వల్ల 16శాతం మంది పక్షవాతం బారినపడుతున్నట్లు వెల్లడైందన్నారు. 

raja


పురుషుల్లో కంటే మహిళల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రుతుస్రావం, గర్భనిరోధక మాత్రలు వాడటం, కుటుంబ ఒత్తిడి, ఉద్యోగాలు చేసే మహిళల్లో పని ఒత్తిడివంటి కారణాల వల్ల హార్మోన్లలో తేడాలు వస్తుంటాయని.. ఫలితంగా వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఈ విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, సకాలంలో చికిత్స అందిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. 

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మొదటి నాలుగున్నర గంటల్లోపే దవాఖానకు తీసుకువెళితే క్లాట్ బర్‌స్టింగ్ థెరఫీ ద్వారా ప్రాణాపాయం లేకుండా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోకుండా, మాటపడిపోకుండా కాపాడవచ్చని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలావరకు పక్షవాతం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. అందువల్ల పక్షవాతం వ్యాధిపై సరైన అవగాహన పెంపొందించుకుని సరైన జాగ్రత్తలు ఉత్తమమని డాక్టర్ జీ రాజశేఖర్‌రెడ్డి సూచించారు.

2 comments:

  1. I found this blog informative or very useful for me. I suggest everyone, once you should go through this.

    इको फ्रेंडली कलर

    ReplyDelete
  2. Get consultation from Dr. Arvind Nanda for brain stroke interventional radiology treatments
    brain stroke treatment in Delhi NCR

    ReplyDelete