Friday 30 October 2015

వేగంగా అనుమతులు.

పరిశ్రమలను ప్రోత్సహించడంలో తెలంగాణ సర్కారు ముందుంటుందని, ఏకగవాక్ష విధానంతో పరిశ్రమల స్థాపనకు వేగవంతంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పే ర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి సమీపంలో నిర్మించిన శ్రీనివాస జిన్నింగ్,ప్రెస్సింగ్ మిల్లును శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా రైతులపై మిల్లర్లు మానవత్వాన్ని ప్రదర్శించాలన్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే ఏ వ్యాపారమైనా ముందుకు సాగుతుందని వివరించారు.

eetela


గత ప్రభుత్వాల పాపాల ఫలితంగానే రైతులు దుర్భర జీవితాలను అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేయకపోవడం వల్లే రైతులు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేండ్లలో పూర్తి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు 15 ఏండ్లయినా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులతో కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు. గత ముఖ్యమంత్రులు దత్తత పేరుతో పాలమూరును దగాచేశారని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను వెనుకకు నెట్టివేసిన పాపం గత పాలకులదేనని, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.

పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, 2018 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. 2019లో ప్రతీఇంటికి మంచినీరు సరఫరా చేయడమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తున్నదని పునరుద్ఘాటించారు. తర్వాత మంత్రి లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యం తో పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని, మూ డేండ్లలో పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు కసిరెడ్డి నారాయణ్‌రెడ్డి, బాలాజీసింగ్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment