Friday 30 October 2015

పోలీసుల పాత్ర కీలకం

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజాభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకమని జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ అరుణా బహుగణ అన్నారు. ఈ నెల 31న 67వ ఐపీఎస్ పాసింగ్ జౌట్ పరేడ్ జరుగనుందని ఆమె గురువారం పోలీసు అకాడమీ కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా 67వ బ్యాచ్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఐపీఎస్ అధికారులను ఆమె అభినందించారు. యువత సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ జీతాలు, విదేశ అవకాశాలను వదులుకుని ప్రజలకు సేవ చేసేందుకు పోలీసు శాఖలో చేరేందుకు ఆసక్తిని చూపడం ఆనందంగా ఉందన్నారు. 

Arunabahuguna


ఈసారి ఐపీఎస్ అధికారుల శిక్షణలో సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు మానవత విలువలపై ఆయా రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులతో అవగాహన తరగతులను నిర్వహించామన్నారు. దీంట్లో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురాంరాజన్, సీసీఎంబీ డైరెక్టర్ లాల్జీసింగ్, సినీ నటుడు నసీరుద్దీన్ షా తదితరులతో ఐపీఎస్‌లకు క్లాసులు చెప్పించామన్నారు. అంతేకాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాలు, అంధ కళాశాలలో పరిస్థితులను చూపించామన్నారు. 

అలాగే శ్రమదానం చేయించి వారి బాధ్యతలను పెంచామన్నారు. 67వ బ్యాచ్‌లో మొత్తం 156 మంది శిక్షణ పూర్తి చేసుకొని ప్రజా సేవలో అడగుపెట్టనున్నారని ఆమె తెలిపారు. ఈ బ్యాచ్ నుంచి తెలంగాణకు ముగ్గురు ఐపీఎస్‌లను కేటాయించారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన కే అపూర్వరావు తెలంగాణకు ఎంపికయ్యారు. 31న జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌కు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని అరుణ తెలిపారు. 

బాలికల విద్య పెరగాలి 
తెలంగాణ నుంచి మొదటి మహిళా ఐపీఎస్‌గా శిక్షణ పొందడం గర్వంగా ఉంది. బాలికలకు ఉన్నత విద్య అం దినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను. అట్టడుగు స్థాయి ప్రజలకు సేవలందించేందుకే ఐపీఎస్‌ను ఎంచుకున్నాను. హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన నేను నగరంలోనే విద్యాభ్యాసం పూర్తిచేశాను. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువై మహిళా సాధికరతకు కృషి చేస్తాను. 


చిట్‌ఫండ్ స్కామ్‌ను అరికడతా 
ప్రజలను మభ్య పెట్టి మోసం చేసే సైబర్ క్రైం, చిట్‌ఫండ్ స్కామ్‌లను అరికడతాను. ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసు శాఖ తనకు వారధిగా ఉంటుందని భావించి ఈ వృత్తిలోకి వచ్చాను. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్ తనకు బాగానచ్చింది. మా కఠిన శిక్షణ ఉద్యోగ లక్ష్యాలను గుర్తుచేసింది 


ప్రజలకు అందుబాటులో ఉంటా 
వరంగల్ ఎన్‌ఐటీ లో విద్యాభ్యాసం చేసి, తెలంగాణకు ఐపీఎస్ గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. మెకానికల్‌ఇంజినీరింగ్ చేసిన నాకు కార్పొరేట్ ఉద్యోగం మానసిక సంతోషాన్ని ఇవ్వలేదు. దీంతో ప్రజాసేవకు ఆ ఉద్యోగం సరిపోదని భావించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే పోలీసు శాఖను ఎంచుకున్నాను.

No comments:

Post a Comment