SWINE FLU IN HYDERABAD
రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వస్తోన్న పుకార్లను నమ్మొద్దని రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ అధికారి లలిత కుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు నెలల్లో 2055 మందికి పరీక్షలు నిర్వహించగా 443 మందికి స్వైన్‌ఫ్లూ నిర్దారణ అయిందని తెలిపారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయని వివరించారు. స్వైన్‌ఫ్లూను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసిందని తెలిపారు.
No comments:
Post a Comment