Friday 30 October 2015

తిండి కోసం ఏకంగా ఇంటినే అమ్మేశారు

ఆకలేస్తే అన్నం తినాలి. అది కూడా ఇంట్లో వండుకొని తింటే అదో తృప్తి. ఎప్పుడో ఒకసారి హోటల్‌కి వెళ్లి ఘాటు రుచులను ఆస్వాదిస్తారేమో! కానీ రోజూ ఎవరైనా హోటల్లోనే తినాలనుకుంటారా? ఎంతటి భోజన ప్రియులైనా ఇంట్లో వండుకొని తింటే బాగుంటుందంటారు. అయితే ఓ జంట మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని ఫుడ్ వెరైటీలు టేస్ట్ చేయాలని కోరిక కలిగింది. ఆ కోరికను తీర్చుకోవడానికి ముందు బెస్ట్ టేస్ట్‌ను అందించే రెస్టారెంట్స్ లిస్ట్‌ను తయారుచేసుకున్నారు. ఇక ప్రపంచ యాత్ర మొదలు పెట్టాలి. దానికోసం డబ్బులు కావాలి. అందుకని ఇంటిని అమ్మేశారు. ఉద్యోగాలు మానేశారు. చేరొక బ్యాగ్ తగిలించుకొని ఫుడ్ మారథాన్ మొదలుపెట్టారు. 

ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, కంబోడియా వంటి దేశాల్లో పర్యటించారు. అక్కడి వంటకాలను లొట్టలేసుకుంటూ లాగించేశారు. పెద్ద రెస్టారెంట్ నుంచి చిన్న హోటల్స్ వరకు సందర్శించారు. ఇప్పటిదాకా వీరు 540 మీల్స్ పూర్తి చేశారట. వీరి తిండి సమాచారాన్ని ఎప్పటికప్పుడు www.littlebrookroad.com అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. తిన్న చోటల్లా వారి లేబుల్‌ని అతికించి మరీ వస్తున్నారట ఈ దంపతులు. ఇంకా చాలా దేశాలు తిరగాలని, ఎన్నో రకాల వంటకాలను టేస్ట్ చేస్తామంటూ ఈ జంట ఊవిళ్లూరుతోంది. 

No comments:

Post a Comment