Friday 30 October 2015

China companies Representatives meet with cm kcr రాష్ట్ర నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు తమ సంసిద్ధతను తెలిపాయి. పలు చైనా కంపెనీల ప్రతినిధులు నేడు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, టన్నెళ్ల నిర్మాణంలో సహకారానికి చైనా కంపెనీలు సంసిద్ధతను వ్యక్తంచేశాయి. అదేవిధంగా తెలంగాణకు ప్రతీకగా నిలిచి ఉండేలా నగరంలోని హుస్సేన్‌సాగర్ ఒడ్డున నిర్మించే టవర్ నమూనా ప్రతిపాదనలు సీఎంకు అందజేశారు. టవర్ నిర్మాణ వ్యయంలో 85 శాతం భరించేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధంగా ఉందని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం టన్నెళ్లను నాణ్యతతో నిర్మిస్తామని వెల్లడించారు. చైనా కంపెనీల ప్రతినిధుల ప్రతిపాదనలపై ప్రభుత్వం మరోమారు సమావేశమై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

అధునాతన టెక్నాలజీ సాయంతో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో టన్నెళ్లు మొదలు బహుళ అంతస్తుల భవనాలు, మల్టీలెవల్ ైఫ్లెఓవర్ వంతెనల నిర్మాణంలో చైనా సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చైనా మౌలిక వసతుల ప్రాజెక్టుల సంస్థల ప్రతినిధులు గతంలో సీఎంతో సమావేశమై చర్చించారు.

No comments:

Post a Comment