Friday 30 October 2015

కొలువుతీరనున్న పెంబర్తి కళ!

వరంగల్ జిల్లా జనగామ మండలంలోని పెంబర్తి హస్తకళాకారులు ఓ వీరజవాన్ కాంస్య విగ్రహానికి ప్రా ణం పోశారు. పంజాబ్, హర్యానా రాష్ర్టాల సరిహద్దు జిల్లా జజ్జర్‌లోని పార్లా గ్రామం ఉమ్రావ్‌సింగ్ స్వస్థలం. భారతసైన్యంలో రాయల్ ఆర్టిలెరి నాన్ కమిషనర్ అధికారిగా విధులు నిర్వర్తించిన కెప్టెన్ ఉమ్రావ్‌సింగ్ 1944లో రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్నారు. 1962లో చైనాతో యుద్ధంలో ఉమ్రామ్‌సింగ్ వీరత్వాన్ని గుర్తించిన యూకే ప్రభుత్వం 2003లో విక్టోరియా క్రాస్ అవార్డును ప్రదానం చేసింది. విక్టోరియా క్రాస్ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు ఉమ్రావ్‌సింగ్ ఒక్కరే. 

అంతటి కీర్తి కలిగిన ఉమ్రావ్‌సింగ్ కాంస్య విగ్రహాన్ని ఆర్మీ అధికారుల కోరిక మేరకు పెంబర్తి హస్తకళాకారులు పదిరోజుల నుంచి శ్రమించి తయారుచేసి శుక్రవారం అందించారు. 210 కిలోల ఇత్తడితో విగ్రహాన్ని తయారుచేశామని, విలువ రూ.మూడు లక్షలు ఉంటుందని హస్తకళాకారులు తెలిపారు. నవంబర్ 1న హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఈ విగ్రహాన్ని ఆర్మీ అధికారులు ఆవిష్కరించనున్నారు. విగ్రహ తయారీలో హస్తకళాకారులు మల్యాల వేణు, శ్రీనివాసా చారి, రాజు, కాళిదాస్, ఆంజనేయులు నర్సింగ్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment