Friday 30 October 2015

చెలరేగిన మావోయిస్టులు

మూడు రాష్ర్టాల్లో మావోయిస్టులు శుక్రవారం రెచ్చిపోయారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒకరిని, మహారాష్ట్ర సరిహద్దులో ఇద్దరిని చంపివేశారు. ఛత్తీస్‌గఢ్‌లో వాహనాలను తగులబెట్టి విధ్వంసం సృష్టించారు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులను (ఎస్పీవో) నక్సల్స్ చంపివేశారు. మృతులను బ్రిజ్‌లాల్ తులవి (27) అనిల్ కల్కో(30)గా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కేర్‌గత్తా గ్రామానికి చెందిన వీరు ఎస్పీవోలుగా పనిచేస్తున్నట్లు గడ్చిరోలి జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ధనోర తాలుకా సావర్‌గాన్ గ్రామ సమీపం వద్ద గడ్చిరోలి-రాజ్‌నంద్‌గాన్ అంతరాష్ట్ర రహదారిపై కొందరు మావోయిస్టులు పదునైన ఆయుధాలతో వీరిపై దాడిచేసి చంపివేసినట్లు పోలీసులువర్గాలు తెలిపాయి. ఘటన స్థలం వద్ద నక్సల్స్ కరపత్రాలు వేసినట్లు వచ్చిన వార్తలను పోలీసులు తోసిపుచ్చారు.

lprry


మరోఘటనలో రేపంపల్లి అటవీప్రాంతంలో 20కిలోల పేలుడు పదార్థాలు, వైరు బండెల్స్ లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వారం రోజులుగా అనేక విధ్వంసాలకు పాల్పడుతున్న మావోయిస్టులు శుక్రవారం కూడా బీభత్సం సృష్టించారు. కాంకేర్ జిల్లా అంతాగఢ్ పోలీస్‌స్టేషన్ సమీపంలో చారుగావ్ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఐరన్‌వోర్‌పై దాడికి పాల్పడ్డారు. ఇనుప ఖనిజం తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు.. పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా గనిలోకి ప్రవేశించడంతో అక్కడి కార్మికులు భయంతో పరుగులుతీశారు.

buss


మావోయిస్టులు ఆ కంపెనీకి చెందిన 24 ట్రక్కులు, రెండు టిప్పర్లుసహా 28 వాహనాలను తగలపెట్టారు. ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడే మాటువేసిన మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపినట్లు తెలిసింది. సుమారు రెండుగంటలపాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలో తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సును దహనం చేశారు. రోడ్డుకు అడ్డంగా కందకాలు తవ్వి చెట్లను రోడ్డుపై పడవేశారు.

ఆదిలాబాద్‌లో గిరిజనుడి హత్య
మంచిర్యాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని కాల్చి చంపారు. మండలంలోని కేరెగూడకు చెందిన కుర్సింగ బల్లార్షాను శుక్రవారం కొందరు మావోయిస్టులు పక్కనే ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లారు. తమ సమాచారం పోలీసులకు ఇస్తున్నాడని, ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోవడంతో చంపివేసినట్లు వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. శనివారం ఘటన స్థలం నుంచి శవాన్ని తిర్యాణికి తెప్పించుకొని అక్కడి నుంచి బెల్లంపల్లికి తరలించనున్నారు.

No comments:

Post a Comment