Friday 30 October 2015

సీడ్‌బౌల్‌గా Telangana

telangana రాష్ర్టాన్ని విత్తన ఉత్పత్తి భాండాగారంగా తయారుచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బీర్కూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లు, డ్వాక్రా రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో విత్తనోత్పత్తితో ఉత్పత్తి సంస్థలే లాభపడ్డాయన్నారు. స్వరాష్ట్రంలో రైతులు బాగుపడేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని చెప్పారు. వర్షాభావంతో పంటలు ఎండినష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కరువు మండలాలను గుర్తించేందుకు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. మూడురోజుల్లో నివేదిక వస్తుందని, వెంటనే కరువు మండలాలను ప్రకటిస్తామన్నారు. గతంలో ఇన్‌పుట్ సబ్సిడీ రెండేండ్లకు వచ్చేదని, టీఆర్‌ఎస్ హయాంలో అలా జరగనివ్వబోమన్నారు. గొల్ల, కురుమలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్‌సీడీసీ కింద జిల్లాకు రూ.50 కోట్లు అందించనుందని తెలిపారు. 

అనాథలు, పేదవారికి రూ.30 వేల తో గొర్రెలు, పెరటి కోళ్లను అందించి ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం దని చెప్పారు. శ్రీనిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.150 కోట్లతో బర్రెలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ తరఫున రూ.5,500 కోట్లు, రోడ్లు భవనాల శాఖ తరఫున రూ.1100 కోట్ల నిధులతో రోడ్డు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. నాణ్యతలో తేడాలు వస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. నాణ్యత పాటించకుంటే బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదని, బ్లాక్‌లిస్టులో పెడుతామని హెచ్చరించారు.

No comments:

Post a Comment