Friday 30 October 2015

అఖిల్ గిన్నిస్ ప్రసంగం

నలభై ఎనిమిది గంటల నాన్‌స్టాప్ ప్రసంగంతో గిన్నిస్ రికార్డే లక్ష్యంగా వరంగల్ ఏవీవీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థి గంగాపురం అఖిల్ ప్రసంగం కొనసాగుతూ ఉంది. భారత స్వాతంత్య్ర సమరయోధులు -దేశ భక్తులుఅంశంపై కొనసాగుతున్న ప్రసంగం రెండోరోజు శుక్రవారం అదే ఊపుతో ఉత్సాహభరితంగా సాగింది. పలువురు ప్రముఖులు అఖిల్‌ను అభినందించారు. డాక్టర్లు మాధవరావు, జనార్దన్, ఎస్ వెంకట్రాంరెడ్డి, సుదర్శన్‌రెడ్డి అఖిల్ ఆరోగ్యాన్ని పరీక్షించి అభినందించారు.

No comments:

Post a Comment