Friday 30 October 2015

రాష్ట్ర రాజధాని అభివృద్ధి..

దేశంలో ప్రసిద్ధికెక్కిన నగరాలకు దీటుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అన్నిరకాల వసతులు, సౌకర్యాలున్నాయని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. తాగునీటి పైపులైన్, రోడు అభివృద్ధి పనులకు శుక్రవారం మాదాపూర్‌లో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఐటీ కారిడార్‌లో తాగునీటి సరఫరాకు రూ.25కోట్లతో పైపులైన్, రూ.16కోట్లతో రోడ్లనిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు.
-ఐటీ కారిడార్‌లో పైపులైన్, రోడ్ల పనుల శంకుస్థాపనలో కేటీఆర్
-మరో రెండు సంవత్సరాల్లో20వేల కోట్లతో నగర అభివృద్ధి
-178కోట్లతో దుర్గంచెరువు మీదుగా ైఫ్లెఓవర్

ఈ పనులతో ఐటీ ఉద్యోగులతో పాటు నివాస ప్రాంతాల ప్రజలకు కలిపి సుమారు 30లక్షల జనాభా దాహార్తిని తీరుస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో రానున్న రెండు సంవత్సరాలకాలంలో రూ.20వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. పీవీఎన్‌ఆర్‌లాంటి ైఫ్లెఓవర్ బ్రిడ్జీలు నగరానికి నాలుగు వైపుల ఏర్పాటు చేస్తామన్నారు. రూ.265కోట్ల వ్యయంతో నగరంలో స్కైవే లు, వంతెనలు, పార్కింగ్ తదితర అభివృద్ధి కార్యాక్రమాల ను చేపడుతున్నామన్నారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు రాకపోకలకు తీవ్రఇబ్బందులు పడుతున్నారన్నారు. రూ.178కోట్ల వ్యయంతో దుర్గంచెరువు మీదుగా ైప్లెఓవర్ బ్రిడ్జి నిర్మించి జూబ్లీహిల్స్ రోడు నెం-45, 36లకు అనుసంధానం చేస్తామన్నారు.

తాగు నీటికి డోకాలేదు..


హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, మంజీరా, సింగూరు రిజర్వాయర్లు వర్షభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయినా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాలతో నగరవాసులకు తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్టు కేటీఆర్ వివరించారు. కృష్ణాజలాలు నవంబర్ 15కి, గోదావరి జలాలు డిసెంబర్ 15కి అందిస్తామన్నారు. కృష్ణా ఫేజ్-3లో జరిగిన అవాంతరాలు తొలగిపోవడంతో పనుల్లో వేగం పెరిగిందన్నారు. కృష్ణా మూడోదశ నీరు ప్రస్తుతం మైలార్‌దేవరపల్లి వరకు వచ్చిందన్నారు. గోదావరి జలాలు ఇప్పటికే సుమారు 150 కి.మీ మేరకు మల్లారం ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు చేరుకున్నాయన్నారు.

ట్రయల్న్ ప్రారంభమైందని మంత్రి స్పష్టంచేశారు. నగరంలో రెండు సంవత్సరాల్లో వేయి కి.మీ వరకు రూ 575 కోట్లతో బీటి రోడ్లు, 400 కి.మీ వరకు వైట్ ట్యాపింగ్ రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాబోయేరోజుల్లో 1800 మెగవాట్ల విద్యుత్తును అదనంగా తీసుకువస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద శేరిలింగంపల్లిని ప్రథమంగా ఎంపిక చేసి ఎల్‌ఈడీ లైట్ల పంపిణీకి కార్యాచరణ చేపట్టనున్నట్టు చెప్పారు.

శేరిలింగంపల్లిని దత్తత తీసుకోవాలని ఉంది....


శేరిలింగంపల్లిని ఐటీ ఉద్యోగులతోపాటు తానుకూడా దత్తత తీసుకోవాలని ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మేల్యేను ఈ ప్రాంతాన్ని దతత్త తీసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు.

కేటీఆర్ కృషి మరవలేనిది.. మంత్రి మహేందర్‌రెడ్డి


రాష్ట్ర రవాణా శాఖమంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాల్లోని 10పాత మున్సిపాలిటీలైన శేరిలింగంపల్లి నుంచి ఎల్బీనగర్, రాజేంద్రనగర్ వరకు గల వివిధప్రాంతాలకు రూ1900కోట్లతో మంచినీటి సౌకర్యం కోసం రెండుమూడు రోజుల్లో జీవోను తీసుకుచ్చిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలోని వ్యాపార, పారిశ్రామికవేత్తలు రంగారెడ్డి జిల్లాను తమ కార్యకలాపాలకు ఎంచుకోవడం జిల్లామంత్రిగా తనకు ఎంతో గర్వకారణమన్నారు.

దేశంలోనే హైదరాబాద్ నగరాన్ని అగ్రగామిగా తీర్చేందుకు సీఎం నెలనెలా సమావేశాలను నిర్వహించి సమీక్షిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ ఎండీ జనార్దన్‌నెడ్డి, ఐటీశాఖ సెక్రెటరీ జయేష్‌రంజన్, సైబరాబాద్ కమిషనర్ సీవి ఆనంద్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, జలమండలి డైరెక్టర్ జి.రామేశ్వర్‌రావు, శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణ, వాల హరీశ్‌రావ్, కోమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
capitals

No comments:

Post a Comment