Friday 30 October 2015

అవినీతిపై విచారణ చేపట్టాలి

సింగరేణి పరిధిలోని రామగుండం డివిజన్-3లోని ప్రతిష్ఠాత్మక అడ్రియాల బొగ్గుగనిలో జరిగిన రూ.400 కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని సింగరేణి కార్మిక సంఘం(సికాస) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.1300 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అడ్రియాల గనిలో 1200 మీటర్ల లోతువరకు వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితులున్నాయని, ఆసియా ఖం డంలోనే అత్యంతలోతైన ఈ గనిలో అధికారుల అవినీతితో పాటు కార్మికులపై పనిభారం పెంచారన్నారు. పనిస్థలాల్లో కార్మికులకు వసతులు కల్పించడం లేదని, అన్నిగనులకు భిన్నంగా ఆడ్రియాలలో పాలన కొనసాగుతున్నదన్నారు. అధికారులు.. కార్మికులగా ఉండాల్సిన సంబంధం, ఈ గనిలో యాజమాన్యం.. కార్మికులుగా మారిందన్నారు. కార్మికులను బానిసలుగా చూడడం సరికాదని, తక్షణమే యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment