Friday 30 October 2015

హైడ్రామా..ప్రేమ పెండ్లి

వర్ధమాన గాయని మధుప్రియ ప్రేమ వివాహం శుక్రవారం హై డ్రామా నడుమ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన బంగి శ్రీకాంత్ హైదరాబాద్‌లోని నల్లకుంట లో ఉద్యోగరీత్యా నివాసముంటున్నాడు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ కుటుంబం చాలాకాలం కిందటే హైదరాబాద్‌లో స్థిరపడింది. చిన్నతనం నుంచే మధుప్రియ గాయనిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నల్లకుంటలోనే నివాసం ఉంటున్న మధుప్రియ ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ మొదటి సంవత్సరం 

madhupriya


చదువుతున్నది. ఉద్యోగం చేస్తూనే షార్ట్‌ఫిల్మ్స్ తీసే శ్రీకాంత్‌కు మధుప్రియతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేండ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల కిందటే మధుప్రియకు 18 ఏండ్లు దాటాయి. అప్పటి నుంచి ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. రెండు వైపులా కోరగా, శ్రీకాంత్ తల్లిదండ్రుల నుంచి అంగీకారం వచ్చింది. ఇప్పడే పెండ్లి వద్దంటూ మధుప్రియ తల్లిదండ్రులు నచ్చజెప్పినా ఆమె వినలేదు. ఇద్దరూ మేజర్లుకావడంతో శుక్రవారం కాగజ్‌నగర్‌లో పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. రెండురోజుల కిందటే మధుప్రియ కాగజ్‌నగర్ చేరుకున్నది. 

శుక్రవారం తెల్లవారుజామున మధుప్రియ తల్లిదండ్రులు నాలుగు వాహనాల్లో వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. శ్రీకాంత్ ఫిర్యాదుతో పోలీసులు బెల్లంపల్లి, కౌటాలలో నాలుగు వాహనాలను అడ్డగించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మధుప్రియను, ఆమె తల్లిదండ్రులను కాగజ్‌నగర్ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కౌన్సెలింగ్ కొనసాగింది. మంచి ముహూర్తం చూసి వచ్చామని, మార్చి 18న గోదావరిఖనిలో వైభవంగా వివాహం జరిపిస్తామని మధుప్రియకు తల్లిదండ్రులు ఎన్నివిధాలుగా చెప్పినా ఆమె అంగీకరించలేదు. ఏం చేయాలో తోచనిస్థితిలో మధుప్రియ తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ముహూర్తం ప్రకారం ఉదయం 11.20 గంటలకు జరగాల్సిన పెండ్లి మధ్యాహ్నం 3.20 గంటలకు జరిగింది.

No comments:

Post a Comment